చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి

చట్టసభలలో బీసీలకు
50% రిజర్వేషన్ కల్పించాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్.
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : బీసీ యువజన సంఘం జిల్లా కార్యాలయంలో,బీసీ యువజన సంఘం నగర అధ్యక్షులు అనుమాసా నితిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దేశంలో 56% పైగా ఉన్న బీసీ జనాభా 75 సంవత్సరాలుగా గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తూనే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్న మెజారిటీ ప్రజలైన బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. కానీ మెజారిటీ ప్రజలైన బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు.
ఇది ప్రజాస్వామ్య దేశo, అయితే బీసీలకు ఏది భాగస్వామ్యం. ఓట్లలో వాటా ఉంది కానీ అధికారంలో వాటా ఏది? బీసీలు దేశ సంపద సృష్టిస్తున్నారు. కానీ సంపదలో వాటా ఏది అన్నారు. అన్ని రంగాలలో బీసీలకు వాటా ఇవ్వాల్సిందేనని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం సేకరించిన గణాంకాల ద్వారా తెలిసింది. కేంద్ర మంత్రివర్గంలో, రాష్ట్ర మంత్రివర్గంలో, లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్ర అసెంబ్లీ కౌన్సిల్లో బీసీల ప్రాతినిధ్యం సర్వే లెక్కించగా 14% దాటలేదంటే బీసీలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అన్యాయం జరుగుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీల ప్రాతినిధ్యం 9 శాతం దాటలేదు. అలాగే ఉన్నత న్యాయస్థానాలలో ఆరు శాతం పారిశ్రామిక కాంట్రాక్టు కార్పొరేట్ రంగాలలో ఒక శాతం దాటలేదుఅన్నారు. బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుస్తుంది. వాస్తవానికి బీసీ ప్రజలు తమ కర్తవ్యాన్ని గుర్తు ఎరిగి బీసీల రాజ్యాధికారం దిశగా ముందుకు రావాలని కోరారు.

ఈకార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్, బీసీ యువజన సంఘం జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ వీణవంక దిలీప్, జిల్లా జాయింట్ సెక్రెటరీ శ్రీకాంత్, యువజన సంఘం నగర ఉపాధ్యక్షులు బండమీది జీవన్ బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *