మసీదులో సొంత నిధులతో బోరుబావి

ఔదార్యం చాటుకున్న కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్
బండ్లగూడ జాగీర్, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ ఒకటో వార్డు లోని మసీదులో సొంత నిధులతో బోరుబావి వేయించిన కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్. మస్జిద్ ఈ రహమతు ల్ లిల్ ఆల్ ఆమెన్ మసీదు వారు నీటి కష్టాలు మసీదులో ఉన్నందున, రంజాన్ పర్వదిన మాసంలో మసీదుకు వచ్చేవారికి ఇబ్బందులు ఉన్నాయని కోరగా స్థానిక కార్పొరేటర్ తలారిచంద్రశేఖర్ సొంత నిధులతో బోరుబావిని వేయించి మసీదు వారికి ఉపయోగపడే విధంగా చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ భాయ్, రషీద్ గౌస్, బాబు మియా, రషీద్, సలీం తదితరులు పాల్గొన్నారు.
