
- ల్యాండ్ పోలింగ్ జీవో ఆర్డినెన్స్ మరొకసారి ప్రభుత్వం పునర్ ఆలోచించాలి
- ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్
మంత్రి కేటీఆర్ పునర్ ఆలోచించాలి - లేనిపక్షంలో ప్రభుత్వం, మంత్రి మల్లారెడ్డి
పతనం మొదలవుతుంది..? - దళితుల భూములు గుంజుకుంటామంటే
వదిలే ప్రసక్తే లేదు: రాపోలు రాములు
బోడుప్పల్, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 169 జీవో తీసుకొచ్చి ల్యాండ్ పోలింగ్ పేరుతో దళితులను దగా చేస్తుందని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు బొల్లిగూడెం పరిధిలోని పెద్ద కంచె శ్రీశ్రీశ్రీ గట్టు మైసమ్మ దేవాలయం పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ సర్వేనెంబర్ 63లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు 1957 సంవత్సరంలో మా 61 కుటుంబాల పూర్వీకులకు ఈ వ్యవసాయ భూమిని అప్పజెప్పి పట్టాలు అందజేశారని పేర్కొన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు పట్టాలు, పాహానీలు, కబ్జాకాలంలో వస్తున్నామని, అప్పుడు మా పూర్వీకులు 61 కుటుంబాలకు గాను ఒక్కొక్క కుటుంబానికి 5.18 ఎకరాల 336 ఎకరాల వ్యవసాయ భూమిని అందజేశారన్నారు.

కానీ ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దొంగ జీవో తీసుకొచ్చి ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితులకున్న భూములను లాక్కొని దగా చేస్తుందని, ఇది ఈ ప్రభుత్వానికి మంచిది కాదని, కొంతమంది దగుల్బాజీ రాజకీయ నాయకులు మా దళితుల కుటుంబాల్లో చిచ్చు పెట్టి రెండు వర్గాలుగా ఏర్పాటు చేసి మా జీవితాలతో అనుకుంటున్నారని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డిల లాంటి నీచ రాజకీయ నాయకులు మా దళితుల జీవితాల్లో మన్ను కొట్టి, మా భూములను లాక్కోవాలని చూస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసం కాదని, మంత్రి మల్లారెడ్డి నీ రాజకీయ పతనం మా బోడుప్పల్ దళితుల నుండే ప్రారంభమవుతుందని హెచ్చరించారు. అప్పుడు మా పూర్వీకులు 61 కుటుంబాలు పట్టా పహానిలు కబ్జా కాస్తూ కలిగి వ్యవసాయం చేసుకున్నారని, వరి తదితర పంటలు పండేవని,కోర్టు కూడా వ్యవసాయ బావులు, కరెంటు మోటార్లు సాంక్షన్ చేశాయని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రైవేటు పట్టా భూములు ప్రభుత్వం ప్రజల అవసరం మేరకు తీసుకునే హక్కు ఉంది కానీ తీసుకునే ముందు దళిత రైతులకు ఎలాంటి నష్టపరిహారవిస్తున్నారో స్పష్టంగా తెలియజేయాలని, ప్రత్యేకించి ప్రభుత్వం నుండి గాని అధికారుల నుండి అని ఒక రిటన్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. మా పూర్వీకుల వ్యవసాయ భూమి రికార్డ్స్ 1995 వరకు ఉన్నాయని,1996 నుంచి కబ్జాకాలం తీసివేయడం జరిగిందని తెలియజేశారు. అప్పటినుండి ల్యాండ్ పోలింగ్ పేరుతో దళితుల అసైన్డ్ ల్యాండ్స్ గుంజుకోవడం జరుగుతుందని అన్నారు.అదేవిధంగా ఉప్పల్ బాగాయాత్ పట్టా ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని అభివృద్ధి చేసి ఒక ఎకరాకు 1000 గజాల చొప్పున ఇచ్చారని, మా దళితుల వ్యవసాయ భూమి తీసుకొని 400 నుండి 600 గజాలు ఇస్తామని ఏ విధంగా నమ్మబలుకున్నారని హెచ్చరించారు. ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి నష్టపరిహారం మాకు నచ్చినట్లైతే మేము మా ల్యాండ్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటామని, లేని పక్షంలో బెదిరించి అదిరించి తీసుకుంటామంటే బోడుప్పల్ దళిత రైతులు సిద్ధంగా లేరని హెచ్చరికలు జారీ చేశారు.

అసైన్డ్ ల్యాండ్ జీవో అనేది 1977లో వచ్చిందని, మాకు అప్పటి ప్రభుత్వాలు 1957 లోనే పట్టాలు ఇచ్చాయని, మాకు అసైన్ల్యాండ్ లకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితల కడుపులు కొట్టకండి, దళితుల జోలికి రాకండి, ఒకవేళ దళిత రైతులతో పెట్టుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి మీ పతణం ఇక్కడి నుండే ప్రారంభిస్తామని, మీ కళ్ళు తెరిపిస్తామని హెచ్చరించారు. అసైన్డ్ భూముల పరిరక్షణ సమితి నాయకులు బుగ్గ మైసయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు అసైన్డ్ భూములు క్రింద నిరుపేద వర్గాలకు ఉపాధి కోసం ఇస్తారని,ఆ భూమిని వ్యవసాయం చేసుకొని,ఆయా దళిత వర్గాలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వాలు ఉదాసీనంగా దళితుల సంక్షేమం కోసం, దళిత రైతుల అభివృద్ధి కోసం ఆనాటి ప్రభుత్వాలు ఈ అసైన్డ్ భూములు ఇచ్చాయని,నేటి ప్రభుత్వాలు దళితుల భూములు లాక్కోవాలనే జీవోలు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తున్నాయని ప్రశ్నించారు.

ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే సర్కారు భూములు గానీ, బడా కంపెనీల వారి వేల ఎకరాల భూములు తీసుకోవాలని, దళిత వ్యవసాయ భూములు తీసుకునే ముందు మీరు ఆయా గ్రామపంచాయతీలో మున్సిపాలిటీలలో రైతు కమిటీలు వేసి నోటీసులు ఇచ్చి పద్ధతి ప్రకారం భూములు తీసుకోవాలి గాని బెదిరించి తీసుకుంటామంటే మాత్రం దళిత రైతులు సిద్ధంగా లేరని హెచ్చరించారు. మీరు గిట్లనే చేసినన్నట్లైతే మాకు న్యాయస్థానాలు ఉన్నాయని, కబ్జాకోరుల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడ బోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత రైతులు రాపోలు కిష్ణయ్య, నత్తి మైసయ్య దళిత రైతులు వారి కుటుంబ సభ్యులు యువత తదితరులు హాజరయ్యారు.