
కరీంనగర్, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదల అయ్యారు. సుదీర్ఘ వాదోపవాదనల తరువాత షరతులతో కోర్టు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు కరీంనగర్ జైలు నుంచి విడుదల అయిన బండి సంజయ్ ప్రభుత్వం పైన మండిపడ్డారు.
టీఎస్పీఎస్పీ లీకేజీ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సంజయ్ డిమాండ్ చేసారు. ఈ లీకేజి కారణంగా నష్టపోయిన నిరుద్యోగ యువత కు లక్ష రూపాయాల చొప్పున భృతి ఇవ్వాలన్నారు. ప్రభుత్వ తీరుతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత నష్టపోయారని వివరించారు. జైయిల్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ ఐదించి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.
కె సి ఆర్ కొడుకు, బిడ్డ జైలు కు పోవడం ఖాయమని జ్యోస్యం చెప్పారు. కెసిఆర్, కేటీఆర్ ల వెంటపడుతా అంటూ ఘాటు విమర్శలు చేసారు బండి సంజయ్.