పురుగుకు పరిష్కారం
INCIPIO కొత్త మందు

ఇల్లంతకుంట, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో సింజెంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో పురుగు మందుల షాప్ యజమానులకు వరి పంట ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో వరిపంటకు అపారా నష్టాన్ని కలిగిస్తున్న మొగి పురుగు మరియు ఆకు చుట్టు పురుగుకు పరిష్కారాన్ని సూచిస్తు సింజెంటా కంపెనీ ప్లీనా జోలిన్ టెక్నాలజి ద్వారా INCIPIO అనే కొత్త మందును ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కరీంనగర్, వరంగల్, పరకాల, నర్సంపేట, పెద్దపల్లి, మంచిర్యాల్ జిల్లాలకు చెందిన సుమారు 400 మంది డీలర్లు మరియు వరంగల్, కరీంనగర్ రీజినల్ మేనేజర్ భరత్,టెరిటరీ మేనేజర్ జమాల్, టెక్నికల్ సపోర్టింగ్ హెడ్ డా. రషీద్, మరియు కంపెనీ మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.