మత్స్యకారులకు అవగాహన సదస్సు

ఇల్లంతకుంట, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : ఈరోజు వీణవంక మండలంలోని చల్లూరు, ఇప్పలపల్లి గ్రామాలకు చెందిన మత్స్యకారులకు చెరువుల పంపకంపై విషయమై ఏసిపి హుజురాబాద్ కె. వెంకట్ రెడ్డి, జమ్మికుంట రూరల్ సీఐ జె.సురేష్, ఎస్ఐ కే శేఖర్ రెడ్డి, ఏడి(మత్స్యశాఖ) ఆధ్వర్యంలో అవగాహన కలిగించడం జరిగింది.
అనంతరం ఎసిపి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని, చట్టాన్ని గౌరవించాలని, చట్టాన్ని చేతిలో తీసుకున్నట్లయితే కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించడం జరిగింది.