సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్
ఎక్స్ప్రెస్ రైలుకు మోదీ పచ్చ జెండా
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్) : ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ ను ప్రారంభించారు. మూడు నెలల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇది రెండో వందే భారత్. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ తమిళిసైతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యేలు ఈటల, విమానాశ్రయానికి చేరుకుని ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.