జమ్మికుంట : బాధ్యతలు స్వీకరించిన
సర్కిల్ ఇన్స్పెక్టర్ బర్పటి రమేష్

జమ్మికుంట, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా శనివారం బర్పటి రమేష్ బాధ్యతలు స్వీకరించారు గతంలో జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన రామచంద్ర రావు జగిత్యాల సీఐగా బదిలీ కావడంతో ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో సిఐ గా పని చేసిన రమేష్ కు రాష్ట్రప్రభుత్వం జమ్మికుంటకు బదిలీ చేయడంతో ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా పలువురు పట్టణ ప్రముఖులు సర్కిల్ ఇన్స్పెక్టర్ కి పుష్ప గుజ్జాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారిస్తాను అన్నారు. పట్టణ ప్రజలు కూడా శాంతి భద్రతల పరిరక్షణ కోసం తనకు సహకరించాలని కోరారు.