ఘనంగా స్కూల్ డే వేడుకలు

వరంగల్, ఏప్రిల్ 9 (విశ్వం న్యూస్) : వరంగల్ నగరంలోని పెరిక వాడలో కల ప్రభుత్వ ఉన్నత పాఠశాల రైల్వే గేట్ లో స్కూల్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. బాలసభ థీమ్ గా నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవ వేడుకలలో 9వ తరగతి విద్యార్థిని ఎస్. మానస ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించి సభను విజయవంతంగా కొనసాగించారు. పాటలు, నృత్యాలు, స్కిట్లతో విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారు. బాల సభలో ఎంపీగా పి.రాజ్ కుమార్, ఎమ్మెల్యేగా జి.ధనుష్, మేయర్ గా ఎస్కే రఫీయా, డీఈవోగా సమీరా, ఎంఈఓ గారు సాత్విక, డిప్యూటీ మేయర్ గా ఆఫ్రిన్, కార్పొరేటర్ గా జి. వెన్నెల, ఎస్ఎంసి చైర్మన్గా అనూష, వైస్ చైర్మన్ గా తృష్ణ, ట్రాఫిక్ సిఐగా విజయకుమార్, షీ టీం సీఐగా కీర్తన, డాక్టర్ గా తులసి, పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా అర్చన లు వ్యవహరించి పలు అంశాలపై అద్బుతంగా మాట్లాడారు.

ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు పెరుమాండ్ల సాంబమూర్తి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకలలో ప్రముఖ సింగర్ లింగాల ఇమ్మానియేల్ పాల్గొని తన పాటలతో విద్యార్థులను చైతన్యపరిచారు అంతకు ముందు బాలసభకు ప్రధాన ఉపాధ్యాయులుగా వ్యవహరించిన యస్. మానస విద్యార్థులందరికీ పెన్నులను బహుకరించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు కె. రామానుజయ్య, ఏ.సదయ్య, చంద్రమోహన్ సింగ్, కె.యాదగిరి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు