కరీంనగర్ డిసిసి కార్యాలయంలో
ఘనంగా ఫూలే జయంతి వేడుకలు

- జ్యోతిబాపూలే జయంతి వేడుక అధికార పార్టీ సమావేశంలా మారింది
- ఫూలే జయంతి వేడుకలలో అధికార యంత్రాంగం విఫలం
- అసహనం వ్యక్తం చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్
కరీంనగర్, ఏప్రిల్ 11 (విశ్వం న్యూస్) : నేడు మహాత్మ జ్యోతిబాపూలే గారి జయంతిని పురస్కరించుకొని మొదట కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారితో పాటు డీసీసీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు హాజరై ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట గల జ్యోతిబాపూలే విగ్రహగం వద్ద జిల్లా కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యఅతిథిగా హాజరై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

అనంతరం మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే గారు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసినారు, అంబేద్కర్ లాంటి వారికి స్ఫూర్తి దాయకులు, ఈ తరం వారు జ్యోతిబాపూలే స్ఫూర్తితో ముందుకు పోవాలని కోరుతూ, మీడియా ప్రతినిధులే ప్రత్యక్ష సాక్షిగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ విధమైన ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేసిన పూలే గారి జయంతి లేదా అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం వేదిక ఏర్పాటు చేస్తే అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అనే తేడా లేకుండా వేదికపై అందరికీ అవకాశం ఇవ్వడం జరిగేది.

ఇప్పుడు అధికారం ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ అది ఒక టిఆర్ఎస్ పార్టీ సమావేశంలా జరుగుతుండటం చాలా దురదృష్టకరం, ఈ కార్యక్రమం నిర్వాహకులైన జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి లేదా ఇతర అధికారులైన కనీసం మానవత్వం లేకుండా, ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానం ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది, అధికార యంత్రాంగం ప్రభుత్వ సొమ్ముతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ సమావేశం కాదని గ్రహించుకోవాలని, ఇక్కడ సభా వేదికపై మాట్లాడుతున్న మాటలను వింటుంటే సిగ్గు అనిపిస్తుంది జ్యోతిబా పూలే జయంతి రోజున కూడా తమ నాయకుల గొప్పలు చెప్పుకోవడానికి భజన చేస్తున్నారు.
నేడు జ్యోతిబాపూలే గారి జయంతి, వారు సమాజంలో మార్పునకు కోసం వారు పడ్డ శ్రమను చేసిన ప్రయత్నాన్ని స్మరించుకొని వారికి నివాళులు అర్పిస్తే బాగుంటుందని, ఈ సందర్భంగా ఈ బుద్ధిలేని వెధవలకు జ్ఞానం రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్ రావు, శ్రావణ్ నాయక్, మడుపు మోహన్, వెన్న రాజ మల్లయ్య, బోనాల శ్రీనివాస్, నాగి శేఖర్, రామిడి రాజిరెడ్డి, సయ్యద్ అఖిల్, లింగంపల్లి బాబు, కల్వల రామచందర్, బొబ్బిలి విక్టర్, నాగుల సతీష్, రామిడి తిరుపతి రెడ్డి, దన్న సింగ్, పోరండ్ల రమేశ్, అనీల్, తదితరులు పాల్గొన్నారు.