గురువు బాటలో శిష్యుడు

హైదరాబాద్, డిసెంబర్ 10 (విశ్వం న్యూస్) : గురువు అంగన్ వాడీలను గుర్రాలతో తొక్కిస్తే శిష్యుడు ఆశవర్కర్లపై లాఠీచార్జి చేయించాడు. ఇచ్చిన హామీ అమలు చేయమన్నందుకు రేవంత్ ప్రభుత్వం ఆశలపై దమనకాండ అమలుచేసింది. అధికారంలోకి రాగానే ఆశ వర్కర్ల జీతం పద్దెనిమిదివేలు చేస్తానని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
దాన్ని అమలు చేయమన్నందుకు ఆశవర్కర్లపై పోలీసులు దాడిచేశారు. మహిళలని కూడా చూడకుండా బూతులు తిట్టారు. మగ పోలీసులు ఎక్కడపడితే అక్కడ చేతులువేసి శునకానందంపొందారు. ఆడదాన్ని అవమానించినోడికి పుట్టగతులు ఉండవని కాంగ్రెస్ సర్కార్ తెలుసుకోవాలి. గురువు చంద్రబాబు అంగన్ వాడి టీచర్లపై గుర్రాలతో తొక్కించి మూల్యం చెల్లించుకున్నాడు. తెలంగాణలో రాజకీయంగా తెరమరుగు అయిపోయాడు.
రేవంత్ కి కూడా అదేగతి తప్పదు.
చీటికి మాటికి బిఆర్ఎస్ పై విరుచుకపడే సిపిఐ,సిపియం నాయకులు ఈ దుర్మార్గంపై ఎందుకు నోరు మెదపడంలేదో సమాధానం ఇవ్వాలి. ఆశవర్కర్లలో ఎక్కువమంది కమ్యూనిస్టు సంఘాల్లోనే ఉన్నారు.
మరి వాళ్ళు రేవంత్ కి ఎందుకు లాలూచీపడ్డారో అర్థంకాదు.
