సకల కళల వల్లబుడు… ప్రభుకు ఘన సన్మానం

సకల కళల వల్లబుడు… ప్రభుకు ఘన సన్మానం

సిద్ధిపేట జిల్లా అడిషనల్ ఎస్ పి మహేందర్
సిద్దిపేట , జనవరి 9 (విశ్వం న్యూస్) : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బహుజన సాహిత్య అకాడమీ (ఎం ఎస్ కె ) టీమ్ వ్యవస్థాపకులు ముక్కెర సంపత్ ఆధ్వర్యంలో గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ వివిధ రంగాలలో నైపుణ్యత కలిగిన అందరికీ జాతీయ అవార్డులు అందుకున్న వారికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి కలలపై మక్కువైన జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభాకర్ (ప్రభు) డప్పు మరియు ఆర్ట్, పాటల రంగాలలో జాతీయ కళారత్న అవార్డు తీసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్ చేతుల మీద ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ (ప్రభు) మాట్లాడుతూ మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను వెలికితీస్తూ వారిని మరింతగా ఈ సమాజానికి గొప్పగా పరిచయం చేస్తున్నటువంటి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ కు మరియు ప్రభు ను ఆ సంస్థకు పరిచయం చేసిన హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన కవి గాయకులు ముక్కెర సంపత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు,
ప్రభు చేతి నుండి జాలువారిన అద్భుతమైన చిత్రాల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల మన్నలను పొందుతూ తమ చిత్రాలు ద్వారా సమాజంలో గొప్ప గుర్తింపు తెచ్చుకుని జీవిస్తున్నట్లు తెలుపుతూ, తమ డప్పు కళ ద్వారా గల్లి లో ఉన్నటువంటి డప్పు వాద్యాన్ని ఒక కళగా మార్చాలని తపనతో 2018లో హుజురాబాద్లో కళా రవళి అసోసియేషన్ నిర్వహించినటువంటి వేదికలో ప్రపంచ గిన్నిస్ బుక్ కు రికార్డును సృష్టించారు, సుమారు 1500 మంది డప్పు కళాకారులకు నాయకత్వం వహించిన ఘనత ఆయన సొంతమని తెలిపారు, తమ డప్పు వాయిద్యం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలలో తన డప్పు కళాకారు టీమ్స్ తీసుక వెళ్లి సామాజిక, చైతన్య కార్యక్రమాలు ఎన్నో నిర్వహించినట్లు పేర్కొన్నారు, ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేసి గొప్పగా సన్మానం ఏర్పాటు చేసి అడిషనల్ ఎస్పీ మహేందర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేయడం గర్వంగా ఉందని, ఇలాంటి అవార్డులు, సన్మానాలు మరింత బాధ్యతను సమాజంలో పెంచుతాయని తెలిపారు. కళలు కళ కోసం కాదని, ప్రజల కోసం పనిచేయాలని నల్ల రాధాకృష్ణ స్ఫూర్తితో ముందుకు సాగుతూ సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలకు తమ వంతు సాయ శక్తుల సేవా కార్యక్రమాలు చేస్తూ సహాయం అందిస్తున్నట్లు ప్రభు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *