
- టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం, సిఎస్ లకు విజ్ఞప్తి
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూతన పే రివిజన్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. చాలా కాలముగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి. 2004 నుండి నియమితులైన ఉద్యోగులకు క్యాంటీబురి పెన్షన్ స్కీమ్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భీమా పథకాన్ని అమలుకై చర్యలు తీసుకోవాలి. ఒక శాతం చందాతో ఈ హెచ్ సౌకర్యాన్ని కల్పించే విధముగా వెంటనే చర్యలు తీసుకోవాలి. గ్రామ పంచాయతీలలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి.
రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ ప్రక్రియ వెంటనే చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలి. వ్యవసాయం మార్కెట్ కమిటీ గ్రంథాల సంస్థ ఉద్యోగులకు సబ్ ట్రెజరీల ద్వారా జీరో వన్ జీరో పద్దు ద్వారా నెలవారి జీతాలు చెల్లించాలి. వీఆర్ఏ వీఆర్ఓల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. నూతన జిల్లాలకు పాత జిల్లాల ప్రతిపాదిక క్యాడర్ స్టంట్ ను మంజూరు చేయాలి. పిఆర్సి ఆమోదం పొంది ఇంకా విడుదల కాని ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ వెంటనే కల్పించాలి.
గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించి అన్ని శాఖలలో ప్రమోషన్ ప్రక్రియ చేపట్టాలి, అన్ని శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీలు వెంటనే చేపట్టాలి. ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్న డి.ఏ లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తోపాటు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు అందరికీ రాష్ట్రస్థాయి ప్రిన్సిపాల్ సెక్రటరీలకు రాష్ట్రస్థాయి అధికారులకు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.