మున్నురుకాపులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి
సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడాకుల అశోక్
ములుగు, మార్చి 1 (విశ్వం న్యూస్) : మున్నూరు కాపులు ఐక్యతతో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాకుల అశోక్ పటేల్, జిల్లా ఇన్చార్జి పిట్టల మధుసూదన్ పటేళ్లు అన్నారు. గోవిందరావుపేట మండలం మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ నీ బుదవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం మాజీ మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు సురవరం వెంకటరామయ్య అధ్యక్షతన వైశ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మండల పరిధిలోని సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరైనారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పైడాకుల అశోక్ పటేల్ హాజరై మాట్లాడుతూ కాపులందరూ సమిష్టిగా ఉండాలని రాజకీయంగా విద్యాపరంగా అన్ని ప్రభుత్వ పథకాలు అందుకునేలా అందరు ఐక్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అనంతరం పిట్టల మధుసూదన్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జనాభాలో 18 శాతం పైగా మున్నూరు కాపులు ఉన్న ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, సౌకర్యాలు అందడం లేదన్నారు. జనాభా దామాషా ప్రకారం కావల్సిన దరిచేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హక్కుల సాధనకై ఐక్యంగా పోరాడాల్సిన తరణం ఆసన్నం అయిందని ఆయన అన్నారు. మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా అల్లూరి నాగేశ్వరరావు, మండల అధ్యక్షులుగా అనిశెట్టి రామకృష్ణ పటేల్, ప్రధాన కార్యదర్శిగా హరిప్రసాద్ పటేల్, కోశాధికారిగా మేకల యాదగిరి స్వామి పటేల్, ఉపాధ్యక్షులుగా పొట్ల సంపత్, పటేల్, నామ్ పూర్ణచందర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మండలంలోని మున్నూరుకాపు సంఘం నేతలు, సభ్యులు పాల్గొన్నారు.
