సమస్య ఏదైనా నేనున్నాను అంటున్న అంబాల ప్రభాకర్ (ప్రభు)

సమస్య ఏదైనా నేనున్నాను అంటున్న అంబాల ప్రభాకర్ (ప్రభు)

హైదరాబాద్, మార్చి 1 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని స్థానిక బస్టాండ్ వెలకాల గల్లీలో గల సీసీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. గత వారం రోజుల క్రితం ఒక గర్భిణి ద్విచక్ర వాహనంపై ఆ రోడ్డుపై నుండి వెళ్తుండగా ప్రమాదవషాత్తు కిందపడి గాయాల పాలైంది. అలాగే ఈ ప్రదేశంలో ఎందరోప్రమాదానికి గురికాగా ఆ సంఘటనలను ప్రత్యేకంగా చూసిన అక్కడున్న కాలనీ వాసులు జాతీయ కళా రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు) దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన ఆయన కాలనీకి చెందిన వ్యాపారులు ఓల్లాల సదానందం, శ్రావణ్ లతో మాట్లాడి దెబ్బతిన్న సిసి రోడ్డుకు కావలసిన సిమెంట్, కాంక్రీట్ మరియు ఇసుక సమకూర్చారు. సుమారు రెండున్నర గంటల పాటు అక్కడే ఉండి అందరినీ సమన్వయం చేసి దెబ్బతిన్న సిసి రోడ్డు పనులను అక్కడే నిలబడి పూర్తి చూపించిన జాతీయ కళా రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు) పలువురు కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వంతో మానవీయ కోణంతో ఆటో ఓనర్స్, డ్రైవర్స్ నాంపల్లి రవీందర్, కనకం అంకుస్, గడ్డం రాజు, పనులను స్వయంగా చేయడాన్ని ప్రభు వారిని అభిందించారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రావు, సురేష్, సంపత్, భాస్కర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *