ఓ నిరుద్యోగి కన్నీళ్ల.. విజ్ఞప్తి…

హైదరాబాద్, అక్టోబర్ 20 (విశ్వం న్యూస్) : ఈ నిరుద్యోగి కన్నీళ్లు చూసి బాధతో గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు వారి సహచర క్యాబినెట్ మంత్రులకు దాసోజు శ్రవణ్ కుమార్ విజ్ఞప్తి.

గౌరవ తెలంగాణ సీఎంఓ గారు మరియు గౌరవ మంత్రివర్యులు, మీరు మానవత్వంతో కొద్దిసేపు జత చేయబడ్డ వీడియోను చూడండి.. ఈ విద్యార్థి ఆవేదనను ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా అర్ధం చేసుకోండి.. గ్రూప్1 ఆశావాదుల సమస్యను లోతుగా విశ్లేషించండి, ప్రశ్న పత్రాల దిద్దటంలో లోపాలు, తెలుగు అకాడమీ పుస్తకాంశాలను బేఖాతరు, #GO29 & GO 55 లో ఉన్న తేడాలను అధ్యయనం చేయండి..

ఒక్కసారి నిష్పక్షపాతంగా పరీక్ష ఫలితాల లిస్టును పరిశీలించండి .. మీకు తప్పని సరిగా జరిగిన లోటుపాట్లు అర్ధం అవుతాయి. GO 29 కేవలం గ్రూప్ 1 సమస్య మాత్రమే కాదు, భవిషత్తు అన్ని ప్రభుత్వ రిక్రూట్మెంట్ల విషయంలో ఇది SC, ST, BC లకు ప్రతిబంధకమే..

సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వచ్చే లోపే మీరు భేషజాలకు పోకుండా విద్యార్థి నిరుద్యోగుల కోరిక మేరకు పరీక్షను వాయిదా వేసి స్పష్టంగా కనపడుతున్న తప్పులను సరిదిద్దండి.. మీరు 5 ఏళ్లకు మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రులు, కానీ 100 ఏళ్ళ భవిష్యత్తు జీవితాలను, పేదవర్గాల నిరుద్యోగులు, వాళ్ల కుటుంబాలు కన్న కలలను భగ్నం చేయకండి. ఇప్పటికైనా తప్పును సరిదిద్దితే, మీకు ప్రత్యేకించి జరిగే నష్టం ఏమి లేదు, పైగా మంచి పేరు వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *