శ్రీ వెంకటేశ్వర కాలనీ అధ్యక్షునిగా ఆనంద్ గౌడ్ ఎన్నిక

బోడుప్పల్:శ్రీ వెంకటేశ్వర కాలనీ
అధ్యక్షునిగా ఆనంద్ గౌడ్ ఎన్నిక

బోడుప్పల్, మే 29 (విశ్వం న్యూస్): బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన కాలనీ సర్వసభ్య సమావేశంలో ఎల్లికట్టే ఆనంద్ గౌడ్ ను కాలనీ వాసులు అందరు కలసి 2వ సారీ ఏకగ్రవంగా కాలనీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జనరల్ సెక్రెటరీగా సతీష్, ట్రెజరర్ గా మైపాల్, అడ్వైజర్ గా దశరథుడు, హరికృష్ణ గౌడ్, జాయింట్ సెక్రటరీగా శంకర్ దయ, వైస్ ప్రెసిడెంట్ గా రాజేష్ కుమార్, సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ఈ కారిక్రమంలో కాలనీవాసులు రఘువీర్ సింగ్, శ్రీనివాస్, కిషోర్, సంతోష్ మహిళలు,యువత పెద్ద సంఖ్యలో హాజరై అధ్యక్షులు ఆనంద్ గౌడ్ ను ఘనంగా సత్కరించారు.

నూతనంగా ఎన్నికైన కాలనీ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ డ్రైనేజీ, వాటర్, సిసి రోడ్ల సమస్యలు స్థానిక కార్పొరేటర్ అండతో కాలనీలో పలు సమస్యలు సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని, అదేవిధంగా కాలనీ వాసులు రెండవ సారి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కాలనీ ప్రజలకు రుణపడి ఉంటానని అందరి సమక్షంలో తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కాలనీ అధ్యక్షునిగా ఎన్నికైన ఆనంద్ గౌడ్ అదేవిధంగా కాలనీ కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన స్థానిక కార్పొరేటర్ కాటపల్లి లతా రామచంద్ర రెడ్డి. ఈ కార్యక్రమంలో హుడా లక్ష్మి నగర్ అధ్యక్షులు అమరలింగారెడ్డి తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *