బోడుప్పల్ 5వ డివిజన్ కు ఆర్టీసీ
బస్సు పున ప్రారంభించాలి

ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ ను
కలిసిన కార్పొరేటర్ సింగిరెడ్డి
బోడుప్పల్, మే 29 (విశ్వం న్యూస్): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టి ఎస్ ఆర్ టి సి) మేనేజింగ్ డైరెక్టర్ వీసి సజ్జనార్ ను బస్ భవన్ లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోడుప్పల్ 5వ డివిజన్ వాసులు ఎదుర్కొంటున్న బస్సు సమస్యల గురించి సజ్జనార్ కి వివరించారు.
వెంటనే స్పందించిన సజ్జనార్ అధికారులను పిలిచి బోడుప్పల్ 5వ డివిజన్ కు బస్సు సర్వీసులను పున: ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తదనంతరం కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి సజ్జనార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పబ్బు సత్యనారాయణ తదతరులు పాల్గొన్నారు.