జనవరి 31 లోపు గ్రూప్స్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలి

జనవరి 31 లోపు గ్రూప్స్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ
ఎస్సీ ఉద్యోగార్థులకు మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణ

పెద్దపల్లి, జనవరి 17 (విశ్వం న్యూస్) : జిల్లాలో గ్రూప్ శిక్షణ కోసం ఆసక్తిగల ఎస్సీ అభ్యర్థులు జనవరి17 నుండి జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ నేడోక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రూప్ 2, 3, 4 నోటిఫికేషన్లు విడుదల చేసిన నేపథ్యంలో షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగుల కోసం మూడు నెలల పాటు ప్రత్యేక ఫౌండేషన్ కోర్స్ నిర్వహిస్తున్నామని , ఆసక్తి గల ఎస్సీ అభ్యర్థులు tsstudycircle.co.in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో జనవరి 31 లోపు దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. గ్రూప్స్ ప్రత్యేక ఫౌండేషన్ కోర్స్ శిక్షణ కోసం అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించకూడదని, 15 జనవరి, 2022 తర్వాత తీసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, గతంలో జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల ఫౌండేషన్ కోర్సులో హైదరాబాదులో సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకున్న వారు అనర్హులని కలెక్టర్ తెలిపారు.
డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశం ఉంటుందని, మొత్తం 100 సీట్లలో 33.3% మహిళలకు, 5% దివ్యాంగులకు రిజర్వేషన్ కేటాయించినట్లు,
ఇతర వివరాల కోసం 9704011827, 9908261045 ఫోన్ నెంబర్ల నందు సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *