కరీంనగర్ : ఎస్ఐ అభ్యర్థుల
రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 7 (విశ్వం న్యూస్) : ఈనెల 8, 9 తేదీల్లో పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్టెఫండరీ క్యాడెట్ ట్రైనీ ఎస్ఐసివిల్ ఎఆర్.టి.ఎస్.ఎస్.పి./ఎస్.పి.ఎఫ్/ఎస్ఆర్ సిపియల్/ఫైర్) అభ్యర్థులకు జరుగనున్న రాత పరీక్షకు ఏర్పాటు పూర్తయ్యాయని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయడు తెలిపారు. రాత పరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు.
రాత పరీక్ష నేపథ్యంలో శుక్రవారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఎస్ఐ అభ్యర్థుల రాత పరీక్ష కోసం కరీంనగర్, తిమ్మాపూర్, నుస్తులాపూర్లలో 18 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్ లోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల, తిమ్మాపూర్ లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల, మహిళ ప్రభుత్వ డిగ్రీ మరియు పిజ్ కళాశాల, వివేకానంద డిగ్రీ మరియు పిజి కళాశాల, అపూర్వ డిగ్రీ కళాశాల, శ్రీ చైతన్య డిగ్రీ మరియు పిజి కళాశాల, ఎస్ఆర్ఆర్ కళాశాల, జేమ్స్ డిగ్రీ మరియు పిజి కళాశాల, వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల, వికాస్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పిజి కళాశాల, ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. నాలుగు పేపర్లు రాత పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 01 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు కొనసాగుతుందని తెలిపారు. రాతపరీక్షకు 13, 547 మంది అభ్యర్థులు: హాజరుకానున్నారని వివరించారు.
అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు
* టి.ఎస్.ఎల్.ఆర్.బి తుది నిర్ణయం మేరకు హాల్ టికెట్లను జారీ చేయడం జరిగింది. డూప్లికేట్
కెట్లను జారీ చేయడం జరుగదు.
* పరీక్షా హాల్లో అభ్యర్థి ప్రవేశం పూర్తి కట్టుదిట్టంగా ఉంటుంది. అభ్యర్థి యొక్క గుర్తింపును ఆయా పరీక్షా కేంద్రాల్లోని సిబ్బంది పూర్తిగా పరిశీలించిన తర్వాత
అనుమతించడం జరుగుతుంది.
* పరీక్ష ప్రారంభం అయిన తర్వాత అభ్యర్థులను పరీక్షాహాల్లోకి అనుమతించడం జరుగదు. పరీక్ష
పూర్తయ్యేంతవరకు కూడా అభ్యర్థులు పరీక్షా హాలును వదిలి వెళ్ళరాదు.
* అభ్యర్థి ఒకనిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడదు.
* అభ్యర్థి తనకున్న హాల్ టికెట్ ను పరీక్షాకేంద్రం ప్రవేశం నందు మరియు పరీక్షాహాల్లో చూపించాలి.
లేనట్లయితే పరీక్షా హాల్లోకి అనుమతించబడదు.
* అభ్యర్థి ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్/ సెల్యూలర్ ఫొన్లుగాని, ట్యాట్స్, పెన్ డ్రైన్లు, బ్లూటూత్లు, వాచ్లు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుళ్ళు, పర్లు, చార్జ్, విడి కాగితములు లేదా
రికార్డు చేసే పరికరాలు
* పరీక్షాహాల్లోకి తీసుకువెళ్ళకుండా తనిఖీ చేయడం జరుగుతుంది. కవి పరీక్షాహాల్లోకి 1) బ్లాక్ లేదా బ్లూపాయింట్ పెన్ను 2) తుది పరీక్ష హాల్ టికెట్ 3) ఏదైనా ఒక ఒరిజనల్ ధృవపత్రం (పాస్పోర్టు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ మొదలగునవి. వెంట ఉంచుకోవాలి).
* అభ్యర్థులు పరీక్షా హాల్లోకి నిర్ణీత సమయానికి ఒకగంట ముందుగా చేరుకోవాలి. పరీక్షరాసే ముందు అభ్యర్థి ఓ.యం.ఆర్ షీట్ పై ఉన్న సూచనలను పూర్తిగా చదువుకోవాలి.
* అభ్యర్థి ఓ.యం.ఆర్ షీట్ పై అనవసరపు సమాచారం, గుర్తులు, మతపరమైన చిహ్నాలు, ప్రార్ధనలు లేదా గుర్తింపు చిహ్నాలు మొదలగునవి ఏవైనా రాసినచో అట్టి జవాబు పత్రాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగదు. ఓ.యం. ఆరోషీట్ పై చిత్తుపని చేయరాదు. పరీక్షాహాల్లో అభ్యర్థి ఏవిధమైన వంచనాయుత చర్యలకు పాల్పడినా అతని ఓ.యం.ఆర్ జవాబుపత్రాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగదు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
* అభ్యర్థికి బదులు మరొక అభ్యర్థి పరీక్ష రాసినట్లయితే వారి పరీక్షను రద్దు చేసి చట్టపరమైన
చర్యలు తీసుకోవడం జరుగుతుంది.. పరీక్షాహాల్లో అభ్యర్థి యొక్క ఫోటో మరియు వేలిముద్రలు క్షుణ్ణంగా పరిశీలన మొదలగునవి. అభ్యర్ధి యొక్క గుర్తింపు భద్రతకు అనుగుణంగా మరియు ఎటువంటి వంచనలకు అవకాశం లేకుండా ఉండేందుకు పరిశీలించబడును. అభ్యర్థులు మెహంది. సిరా మొదలగునవి వారివారి చేతులపై గానీ పాదాలపై గానీ రాసుకుని రాకూడదు.
* ప్రశ్నపత్రం ఇంగ్లిష్/ తెలుగు లేదా ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో ఇవ్వబడును. ఓ.యం.ఆర్ జవాబుపత్రంలో వృత్తములను బ్లూ లేదా బ్లాక్ పెన్నులతో మాత్రమే పూరించవలెను. వేరే ఏ ఇతర రంగు పెన్నులు, పెన్సిళ్ళు, ఇంక్/జెల్ పెన్నులు అనుమతించబడవు.
* పరీక్షకేంద్రం యొక్క మార్పు అనుమతించబడదు.
అభ్యర్థుల కోసం నిషేధింపబడినవి:
1)జవాబుపత్రంలో నిర్దేశించబడిన స్థలంలోనే హాల్టి టికెట్ నెంబర్ రాయాలి.
2)జవాబుపత్రంలోని ఇతర ప్రదేశాల్లో ఎక్కడా పేరు రాయకూడదు.
3)అభ్యర్థికి సంబంధించిన వివరములు ఏవీ కూడా జవాబుపత్రంలో రాయకూడదు. పరీక్ష సమయంలో నగరంలో పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని కమీషనర్ పోలీసు అధికారులను ఆదేశించారు. లాడ్జిలలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని చెప్పారు..
ఈ సమావేశంలో అడిషనల్ డిపి (పరిపాలన) జి చంద్రమోహన్, ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు) ఏసిపిలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, జి విజయ్ కుమార్, కె శ్రీనివాస్, సి.ప్రతాప్, ఎస్బిఐలు: జి వెంకటేశ్వర్లు, బి సంతోష్ కుమార్ లతో పాటుగా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.