హైదరాబాద్

ప్రభుత్వ భూములు, పార్కుల వైపు చూసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ భూములు, పార్కుల
వైపు చూసిన చట్టపరమైన
చర్యలు తీసుకుంటాం

  • చర్యలతో పాటు పీడి ఆక్ట్ పెట్టడానికి కూడా వెనకాడబొమని హెచ్చరించారు
  • ఎమ్మార్వో మైపాల్ రెడ్డి, ఆర్ఐ సునీత ఆధ్వర్యంలో సూచిక బోర్డుల ఏర్పాటు

బోడుప్పల్, ఏప్రిల్ 25 (విశ్వం న్యూస్) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ దేవేంద్ర నగర్,అంబేద్కర్ నగర్ తదితర కాలనీల ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 63/1 కు సంబంధించి కొంతమంది కబ్జాదారులు ఖబ్జ్జా చేస్తున్నారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సోమవారం ప్రజావాణిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రం ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.

విషయాన్ని పురస్కరించుకొని స్పందించిన మేడిపల్లి మండల తాసిల్దార్ మహిపాల్ రెడ్డి, ఆర్ఐ సునీత ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమి అని సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడిపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూములు, పార్కు భూములను ఎవరైనా కబ్జ చేయాలని చూసినా, కబ్జా చేసినా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పీడి ఆక్ట్ కూడా పెట్టడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.

ప్రజాప్రతినిధుల పైన అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులపైన కూడ ఉపయోగాలు వస్తున్నాయని.. ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *