యువత వ్యాపార రంగాలలో ముందుకు సాగాలి

యువత వ్యాపార రంగాలలో ముందుకు సాగాలి

ఆర్థిక అభివృద్ధి చెందాలి – ఆత్మగౌరవంతో బతకాలి
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్.

హైదరాబాద్, జనవరి 1, (విశ్వం న్యూస్) : హుజురాబాద్ సైదాపూర్ రోడ్ లో హిమాన్షు ఏజెన్సీస్ వాటర్ ప్యూరిఫైయర్ షాప్ ను ఆదివారం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత వ్యాపార రంగాల్లో ముందుకు వెళుతూ ఆర్థిక అభివృద్ధి చెందాలని తెలిపారు, అందులో భాగంగానే ఎస్సీలకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత సంవత్సరం హుజరాబాద్ నియోజకవర్గం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి దేశంలో ఏ రాష్ట్రంలోని విధంగా దళితులను ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దళిత బంధు అనే పథకాన్ని రూపొందించి నియోజకవర్గం లో సుమారు 2000 కోట్లతో దళితులకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తూ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాడని తెలిపారు. అదే విధంగా హుజురాబాద్ నియోజకవర్గం పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళితులను ఆర్థికంగా ఆదుకునే దిశగా దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విడతల వారిగా రూపకల్పన చేసినారని తెలుపుతూ దళితులు ఆర్థిక అభివృద్ధి చెందుతూనే, సామాజికంగా ఆత్మ గౌరవంగా బ్రతుకుతారని గొప్ప సంకల్పంతో రూపకల్పన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులందరూ కృతజ్ఞత భావంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలానికి చెందిన ఇసంపల్లి సుధాకర్ ఎర్రోళ్ల సుధాకర్ అను నిర్వాహకులకు శాలువాతో సత్కరించే శుభాకాంక్షలు తెలియజేసి ఈ షాప్ ద్వారా ఆర్థికంగా అంచలంచలుగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు, హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వీరిద్దరికీ దళిత బంధు పథకం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ , జాతీయ కళా రత్న అవార్డు గ్రహీత బిఆర్ఎస్ నాయకులు అంబాల ప్రభాకర్ (ప్రభు) లో పాటు వార్డ్ కౌన్సిలర్లు , ప్రజా ప్రతినిధులు , బిఆర్ఎస్ నాయకులు, అంబాల పవన్ కుమార్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *