బండ్లగూడ జాగిర్ కమీషనర్ గారు….. జర దేఖో

గాడి తప్పుతున్న
వీధి దీపాల నిర్వహణ

  • ఎన్నిసార్లు ఫోన్ చేసినా అధికారులు స్పందించడం లేదు.
  • ప్రజలకు తప్పని అవస్థలు
  • పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణ

బండ్లగూడ జాగిర్, ఫిబ్రవరి 9 (విశ్వం న్యూస్) : నగరంలో వీధి దీపాల నిర్వహణ అత్యంత అధ్వానంగా మారింది. లైట్లు వెలగక అత్యధిక ప్రాంతాల్లో అంధకారం అలుముకుంటోంది. శివారు ప్రాంతాల్లో పరిస్థితి మరీ దయనీయం. ప్రత్యేకించి బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ వార్డులో Kk నగర్ కాలనీ ఫేజ్-2, గంధంగూడలో ఎన్నో రోజులుగా ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వాహణ గాడి తప్పుతోంది.

ఫలితంగా ప్రజలకు అవస్థలు తప్పటం లేదు. చీకటిపడగానే వెలుగులు విరజిమ్మే ఎల్‌ఈడీ దీపాలు ఇప్పుడు మొరాయిస్తున్నాయి.

క్షేత్రస్థాయి సిబ్బంది వీధి దీపాల సమస్యలపై తక్షణం స్పందించడం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అధికారులు స్పందించడం లేదు. వీధి దీపాలు నిర్వహణ సరిగా లేక అనేక వీధుల్లో అంధకారం నెలకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *