రూ.2.07 కోట్లతో అభివృద్ధి పనులు
ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
బండ్లగూడ జాగీర్, ఆగస్టు 29 (విశ్వం న్యూస్) : బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని,1,2,3,5 మరియు 15వ వార్డ్ లోని పలు పనులను దాదాపు రూ.2.07కోట్ల వ్యయంతో చేపటినా సీసీరోడ్డులు,డ్రైనేజీలు, మరియు కమ్యూనిటీ హాల్ లకు మేయర్ మహేందర్ గౌడ్ తో కలిసి MLA ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ ప్రతిపక్షాలు రాజకీయ ఉనికి కోసం ఎన్ని విమర్శలు చేసినా, తమ ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నదని అన్నారు.
బండ్లగూడ పరిదిలో కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులే తమ పనితీరుకు నిదర్శమనివారు పేర్కొన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి వారి సమస్యలు పరిష్కరించడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. రహదారుల విస్తరణ, అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఇంటింటికీ తాగునీటి సరఫరా, చెరువుల సుందరీకరణ, ఎన్ఎస్ఓడీపీ నాలాల నిర్మాణం వంటి అనేక పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.
అన్ని పార్టీల నాయకులు అభివృద్ధికి సహకరించాలని MLA సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, అధ్యక్షుడు సురేష్ గౌడ్, కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్, పలువురు కార్పొరేటర్లు, మునిసిపల్ అధికారులు, కాలనీల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.