కరీంనగర్:నేత్రదానం
చేసిన కరబత్తుల విజయ

కరీంనగర్, ఆగస్టు 29 (విశ్వం న్యూస్) : కరీంనగర్‌లోని కాపువాడలకు చెందిన కరబత్తుల విజయ(72) మంగళవారం గుండె పోటుతో మరణిం చారు. ఆమె నేత్రాల దానం గురించి కుమారుడు కరబత్తుల సంపత్, కుమారై కొప్పుల షీలా, అజయ్ లు రేకుర్తి కంటి ఆసుపత్రి నిర్వహణ కమిటి సభ్యులు ఇంజనీర్ కోల అన్నారెడ్డికి సమాచారం ఇచ్చారు.
హైదరాబాద్ ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సిబ్బంది చే నేత్రాలను సేకరింప చేసి ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి ఇవీ వేణుగోపాల్, బొమ్మ రాధాకృష్ణ, వొంటేల రత్నాకర్, అనురాసు కుమార్, బొమ్మరాతి రాజేశం, ముప్పిడి శ్రీనివాస్ బాబు, గాజుల సతీష్ కుమార్, తదితరులు పాల్గోన్నారు.