CPR పైన శిక్షణ ప్రారంభం
- ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్, మార్చి 18 (విశ్వం న్యూస్) : ప్రాణ రక్షణ ప్రక్రియ (CPR-కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్) పై వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరెట్ కాన్ఫెరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, బస్వరాజు సారయ్య, వర్దన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, హుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, సీపీ ఏ. వి. రంగనాథ్, అదనపు కలెక్టర్ లు అశ్విని తానాజీ, శ్రీ వాత్స తదితరులు పాల్గొన్నారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరిగే వారు, చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటలను నేడు మనం ఎన్నో చూస్తున్నాం. ఈ కార్డియాక్ అరెస్ట్ ద్వారా వ్యక్తులు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదంలో పడిన గుండెకు సత్వర చికిత్స అత్యవసరం. గుండెపోటు వచ్చిందంటే.. దవాఖానకు చేర్చి వైద్య చికిత్స అందించేలోపు ఏమైనా జరిగే ప్రమాదం ఉంది. అందుకే గుండెపోటుకు గురైన వారికి సత్వరంగా ప్రాథమిక చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ CPRపైన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అత్యంత కీలకమైన కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సిపిఆర్) పైన ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ సి.పి.ఆర్ పై హెల్త్ కేర్ వర్కర్స్, మునిసిపల్ ఉద్యోగులకు, పోలీస్ సిబ్బందికి, వాలంటీర్లు, షాపింగ్ మాల్ ఉద్యోగులకు, రెసిడెంట్ కాంప్లెక్స్ లకు మరియు ఇతరులకు సి.పి.ఆర్ మరియు ఎ.ఇ.డి పై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
వరంగల్ జిల్లాలో నలుగురు మెడికల్ ఆఫీసర్స్ హైదరాబాద్ లో సి.పి.ఆర్ పై మాస్టర్ శిక్షణ తీసుకొన్నారు.
వీరు రోజుకు 60కి పైగా మందికి శిక్షణను అందిస్తారు.