ఘనంగా మాజీ మాజి ఎం.పి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ మాజి ఎం.పి పొన్నం
ప్రభాకర్ జన్మదిన వేడుకలు

జమ్మికుంట కాంగ్రెస్ ఆధ్వర్యంలో
జమ్మికుంట, మే 9 (విశ్వం న్యూస్) : మాజి ఎం.పి పొన్నం ప్రభాకర్ జన్మదినం సందర్భంగా జమ్మికుంట గాంధి చౌరస్తాలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా పొన్నం జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి రేణుక వేడుకల సందర్భంగా మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఏర్పాటులో డిల్లీ పార్లమెంట్ లో చేసిన పోరాటం ప్రజలు మరువరు. ప్రజల కోసం తనదైన ముద్ర వేసి పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. అనునిత్యం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ శ్రేణులకు అందుబాటులో ఉంటున్న మా నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచున్నామని అన్నారు.

భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు పొందాలని దేవుణ్ణి కోరుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడెపు సారంగపాణి, కనుమల్ల రామకృష్ణ, ఎగ్గని శ్రీనివాస్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, బుర్ర కుమార్, మానుపాటి సూర్య, చిట్యాల శంకర్, గంగారపు మహేష్, మడిపెల్లి అశోక్, చింతల హరీష్ రెడ్డి, దిలీప్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *