
- తెలంగాణ గడ్డపై ప్రియాంక క్రేజ్..

హైదరాబాద్, మే 9 (విశ్వం న్యూస్) : ఏఐసీసీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ.. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీకి స్వాగతం చెప్పటంతో పాటు.. ఆమె ఇచ్చే సందేశం వినేందుకు తెలంగాణ వ్యాప్తంగా యువత భారీ ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ గడ్డపై ప్రియాంక గాంధీ క్రేజ్ గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. సభకు అంచనాలకి మించి కాంగ్రెస్ శ్రేణులు రావడంతో కిక్కిర్సిన సరూర్ నగర్ స్టేడియం.


ప్రియాంకగాంధీ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలలు మాత్రమే సమయంలో ఉన్నందువల్ల ఈ పర్యటన హస్తం క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపింది.
