మహేష్ బాబు ఫ్యాన్స్‌కు
బర్త్ డే ట్రీట్: గుంటూరు కారం
మాస్ పోస్టర్ విడుదల

హైదరాబాద్, ఆగస్టు 9 (విశ్వం న్యూస్) : ఈరోజు సూపర్‌స్టార్ మహేష్ బాబు, పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మహేష్ బాబు ఎప్పటికీ స్టైలిష్‌గా మరియు అద్భుతంగా కనిపిస్తున్నాడు. మాస్ అవతార్ ధరించి, సిగార్ తాగుతున్న మహేష్ పోస్టర్ ఇప్పటికే ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుంది. మహేష్ మాస్ పాత్రలో నటించడం అభిమానులకు, సామాన్య ప్రేక్షకులకు ట్రీట్‌గా ఉంది.
ఇది కుటుంబ అంశాలతో కూడిన యాక్షన్ డ్రామా. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.