బిజెపివన్నీ చిల్లర రాజకీయాలు

బిజెపివన్నీ చిల్లర రాజకీయాలు

టి పి సి సి రాష్ట్ర ఉపాధ్యక్షులు
తోటకూర వజ్రెష్ యాదవ్…
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : దేశ ప్రజల సంక్షేమం, భవిష్యత్తు కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ అయితే, చిల్లర రాజకీయాలు చేస్తూ దేశ ప్రజలను రెచ్చగొడుతూ చిల్లర రాజకీయాలు చేసే పార్టీ బిజెపి అని టి పి సి సి రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీని సత్య నిరూపణ లేని ఆరోపణలను ఆయన ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు టిఆర్ఎస్, బిజెపి పార్టీలు అవినీతిమయంగా డబ్బులు పంచడంలో ఎంతగా పోటీ పడ్డారో ప్రజలందరికీ తెలుసని, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల్లో ఏ విధంగా ప్రసారం చేశారు, ఏ విధంగా పోరాడారు అనేది ప్రజలందరూ గమనించారన్నారు. ప్రజల పక్షాన నిష్పక్షపాతంగా పోరాడుతూ ప్రజల మనసులను గెలుచుకున్న పార్టీ కాంగ్రెస్ యేనన్నారు.

మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎటువంటి అవినీతికి పాల్పడలేదని నిరూపించేందుకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారని, ఇప్పుడు బి ఆర్ఎస్- బిజెపి పార్టీలో వారి సచ్చిలతను తెలియజేసేందుకు భాగ్యలక్ష్మి టెంపుల్ కు వచ్చి ప్రమాణం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *