తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రంజాన్
పవిత్ర మాస శుభాకాంక్షలు

మాజీ జెడ్పిటిసి సభ్యులు, బీఆర్ఎస్
పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విశ్వం న్యూస్) : యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్ర మాస ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసిన ఉమ్మడి ఘట్కేసర్ మండల్ మాజీ జెడ్పిటిసి సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి.
ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ యావత్ భారత దేశంలో అతి ప్రతిష్టాత్మకంగా నిండు మనసుతో క్రమశిక్షణగా కొలిచే ఏకైక పండుగ రంజాన్ పవిత్ర మాస పండుగ. ఈ సందర్భంగా యావత్ భారతదేశం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముస్లిం సోదరీ సోదరిమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అల్లా కటాక్షంతో భారత దేశ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలు కలిగి జీవించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు తెలియజేశారు. ముఖ్యంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ పవిత్ర మాస ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు.