
- ఆరు నెలలైనా అక్రమ నిర్మాణాలు, కబ్జాదారుల మీద చర్యలు లేవు
- నూతన కమిషనర్ అయినా పై విషయంలో చెరువు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు
బోడుప్పల్, ఏప్రిల్ 26 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ ఆంజనేయ నగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు, రోడ్లు, పార్కు, ఖబ్జ చేసి కట్టిన నిర్మాణానాలు, అక్రమ నిర్మాణాల కోసం హరితహారం చెట్లను సైతం నరికేసిన బిల్డర్లు,ఇంటి యజమానుల మీద అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోవాలని ఆరు నెలల క్రితం సోమవారం ప్రజావాణి కలెక్టరేట్లో పెట్టిన దరఖాస్తుకు కూడా ఇంతవరకు చర్యలు గాని సమాధానం గానీ లేదంటే ఇక్కడి బోడుప్పల్ కార్పొరేషన్ అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో అర్థమైంతుందని ఆరోపించారు.

కాబట్టి ఇప్పటికైనా నూతనంగా వచ్చిన కమిషనర్ ఈ విషయాన్ని పరిగణల్లోకి తీసుకోని ఆంజనేయ నగర్ లో రోడ్డు ఇరువైపులా పార్కును కబ్జా చేసి కట్టిన బిల్డర్లు ఇంటి యజమాని పైన చర్యలు తీసుకోవాలని ఆయా కారుని ప్రజలు కోరుతున్నారు.