తునికాకు బోనస్ వెంటనే చెల్లించాలి
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి
గోవిందరావుపేట, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : తునికాకు బోనస్ వెంటనే తునికాకు కార్మికులకు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పసర ఎఫ్ డివో కార్యాలయం ముందు ఆందోళన చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తునికాకు కూలీలకు బోనస్ కింద 2016 నుండి 2022 వరకు బోనస్ 200 కోట్లు ప్రభుత్వం విడుదల చేసి నెల రోజులు దాటినా నేటి వరకు కూలీల అకౌంట్లో డబ్బులు జమ కాలేదని ఆయన అన్నారు.
ఫారెస్ట్ అధికారులు గ్రామ గ్రామాన తిరిగి అకౌంట్లు సేకరించినారని డబ్బులు ఎక్కడ ఆగిపోయాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కూలీలు అయోమయంలో ఉన్నారని ఆయన తెలిపారు. ఫారెస్ట్ అధికారులు తునికాకు బోనస్ విషయంలో తునికాకు కూలీలకు జవాబు తారితనంగా ఉండాలని ఆయన కోరారు . ఈ సంవత్సరము ఎంత బోనస్ వచ్చింది పేర్కొంటూ గ్రామ గ్రామాన ఫారెస్ట్ అధికారులు ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు .వెంటనే కూలీల అకౌంట్లో బోనస్ వెయ్యాలని డిమాండ్ చేశారు.
లేనియెడల తునికాకు కూలీలతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు గొంది రాజేష్, సిపిఎం మండల నాయకులు గుండు రామస్వామి ,సామ చంద్రారెడ్డి, కడారి నాగరాజు, మారబోయిన సారయ్య, అల్లం లక్ష్మి నరసయ్య, చేల ఎర్రక్క ,ఆగబోయిన సుమలత, గిరిజన మహిళలు పాల్గొన్నారు.