రైతులకు ఋణమాఫీ వెంటనే చేయాలి

ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలి
పోడు భూముల రైతులకు శాశ్వత పట్టాలు
అందించాలి : ఎమ్మెల్యే సీతక్క
గోవిందరావుపేట, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే తప్పుడు విధానాలను వెంటనే విరమించుకోవాలని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే దానసరి సీతక్క అన్నారు . మంగళవారం పస్రా గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ స్థల ఆవరణ యందు కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్ అధ్యక్షతన కిసాన్ సెల్ మండల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు శాసనసభ సభ్యురాలు దనసరి సీతక్క హాజరై మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సున్నం పడుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఏక కాలంలో లక్ష రూపాయల ఋణమాఫీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. రైతులకు శాశ్వత పట్టాలు అందిస్తాం అన్న హామీ ఏమైందని ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు, వర్షాల వలన దెబ్బతిన్న పంటలకు నష్టంపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు .
2018 లో రెండో సారి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు ప్రజా సమస్యలను గాలికి వదిలి నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నాడని అన్నారు. రైతుబంధు పథకం భూస్వాముల పథకంగా మారిందని రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించకుండా రైతు శ్రమకు గౌరవం లేకుండా చేస్తున్నాడని విమర్శించారు, పంట కొనుగోలు సమయంలో కోత విధిస్తున్న మిల్లర్లకు కొమ్ము కాస్తూ రైతు శ్రమను దోచుకుంటున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్, ఏకకాలంలో పంట ఋణమాఫీ, పంటకు కనీస మద్దతు ధర, సాగు చేసుకునే రైతులకు పహనీలు, వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, తదితర సంక్షేమ కార్యక్రమాల్ని రైతుల ముందుకు తీసుకువచ్చి రైతును రాజు చేశారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే అందరి బ్రతుకులు మారుతాయని అనుకుంటే పరిస్థితి ఇంకా దిగజారిపోతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలతో రాష్ట్ర ఆదాయాన్ని దోచుకుతింటూ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని అన్నారు., ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన నిలబడి రైతుల కోసం కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అధికార పార్టీలకు చేతకాకపోతే వెంటనే గద్దె దిగండి మేము రైతును రాజు చేస్తాం అని అన్నారు. రైతులను దగా చేసే ప్రభుత్వాలను కూల్చి రైతుల పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ పటేల్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, మండల అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా, జాలపు అనంత రెడ్డి, ఎండి. అఫ్సర్ పాషా, కృష్ణా రెడ్డి, కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి వల్లేపల్లి శివయ్య, కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనేటి శ్యామ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సూడి సత్తిరెడ్డి, వాకిటి రామకృష్ణా రెడ్డి, కాసిడి శ్రీనివాస్ రెడ్డి, చౌలం వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు బండి శ్రీనివాస్, ఆకుతోట చంద్రమౌళి, జిల్లా నాయకులు అర్రేమ్ లచ్చుపటేల్, మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, పాలడుగు వెంకటకృష్ణ, బీసీ సెల్ మండల అధ్యక్షులు కాడబోయిన రవి, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, భూక్య సారయ్య, చింత క్రాంతి, ఎంపీటీసీలు చాపల ఉమాదేవి- నరేందర్ రెడ్డి, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, గోపిదాసు ఏడుకొండలు, పస్రా సర్పంచ్ ముద్దబోయిన రాము, ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డి, సనప సమ్మయ్య, కట్ల జనార్దన్ రెడ్డి, రేగ కళ్యాణి తదితర నాయకులు పాల్గొన్నారు.