ఊపిరి పీల్చుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు

ఢిల్లీ, మార్చి 11 (విశ్వం న్యూస్) : కవిత బయటికి రాగానే.. బీఆర్ఎస్ శ్రేణులు హ్యాపీగా ఫీలయ్యి ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తించాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న కల్వకుంట్ల కవితను ఇవ్వాళ దేశ రాజధానిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ నేపథ్యంలో- తెలంగాణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ అధికారులు.. కవితను ప్రశ్నించడాన్ని నిరసిస్తూ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. ఆందోళనలు చేపట్టారు. ఈడీ ఆఫీసు దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం, మీడియాను, బీఆర్ఎస్ కేడర్‌ను ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో లేకుండా పోలీసులు దూరంగా పంపారు. దీంతో.. కవిత బయటికి రాగానే అరెస్ట్ చేస్తారని ఢిల్లీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కార్యాలయం దగ్గర వాతావరణాన్ని చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రులు ఒకింత టెన్షన్ పడ్డారు.
