ఖమ్మం కదనబేరికి బిఆర్ఎస్ సైన్యం సిద్ధం : డా. రసమయి పిలుపు

ఖమ్మం కదనబేరికి బిఆర్ఎస్ సైన్యం సిద్ధం : డా. రసమయి పిలుపు

తిమ్మాపూర్, జనవరి 17 (విశ్వం న్యూస్) : ఖమ్మం కదన బేరికి కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ సైన్యం సర్వం సిద్దమైందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మాన కొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో జరిగిన సమావే శంలో ఆయన మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షతన బుధవారం ఖమ్మంలో నిర్వహించే భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభకు నియోజకవర్గం నుండి దాదాపు 500 మంది పైగా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనే విధం గా సర్వం సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఈ బహి రంగ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి బుధవారం ఉదయం 8 గo.లకు బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటల వరకు బహిరంగ సభ స్థలి కి చేరుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే రసమయి తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *