బిఆర్ఎస్ వెంటే మహిళలోకం
> ఉవ్వెత్తున ఎగసి ఉద్యమంలా ఖమ్మం సభకు తరలిన పేట మహిళ నాయకురాళ్లు
> దేశ్ కా నేత కెసిఆర్ అంటూ హోరెత్తిన నినాదాలు
సూర్యాపేట, జనవరి 18 (విశ్వం న్యూస్) : ఖమ్మం పట్టణంలో నిర్వహించే బిఆర్ఎస్ ఆవిర్భావ సభకు సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మహిళా నాయకురాళ్ళ ఆధ్వర్యంలో మహిళలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. జై కేసీఆర్ జై జీజేఆర్ దేశ్ క నేత కేసిఆర్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ మహిళా లోకం అంతా బిఆర్ఎస్ వెంటే ఉంటుందని చాటి చెప్పారు. ఈ సందర్భంగా మహిళ నాయకురాళ్లు ఎస్.కె సల్మా మస్తాన్, దండు రేణుక లు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తెలంగాణను దేశానికి దిక్సూచిగా మార్చారని అన్నారు. నేడు యావత్ ప్రపంచం తెలంగాణ వైపు చూస్తుందని అందుకు కారణం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డిలు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలోని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని అన్నారు. దేశానికి కాబోయేనేత కేసిఆర్ అని ఇందులో ఎలాంటి సందేహం లేదని బిఆర్ఎస్ కు వస్తున్న ఆదరణ దాన్ని స్పష్టం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు సారంగుల కరుణశ్రీ, కళ్లేపల్లి మహేశ్వరి లతోపాటు పెద్ద ఎత్తున మహిళలు బిఆర్ఎస్ తొలి సభకు ఖమ్మం తరలి వెళ్లారు.