షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన కుటుంబాన్ని
పరామర్శించిన మేనేని రోహిత్ రావు
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : కరీంనగర్ రూరల్ మండల కేంద్రంలో స్థానిక బహదూర్ ఖాన్ పేట్ గ్రామానికి చెందిన ఆకుల మల్లయ్య కిరాణా దుకాణంలో మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. అక్కడ ఉన్న స్థానిక గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి అప్పటికప్పుడు బావిలో నుండి నీళ్లు తోడుతూ మంటల్ని ఆర్పి వేశారు.
ఈ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దాదాపు 5 లక్షల వరకు ఆస్తినష్టం వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దివంగత నేత ఎమ్మెస్సార్ మనువడు కరీంనగర్ నియోజకవర్గ నాయకులు మేనేని రోహిత్ రావు గ్రామస్తులతో కలిసి బుధవారం రోజు బహదూర్ ఖాన్ పేట్ గ్రామాన్ని సందర్శించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన ఇంటిని పరిశీలించి గాయపడిన కుటుంబ సభ్యులను పరామర్శించి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా రోహిత్ రావు మాట్లాడుతూ స్థానిక మంత్రి గంగుల కమలాకర్ ని స్థానిక పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ని ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ శాఖ కాంగ్రెస్ నాయకులు బురుగు తిరుపతి గౌడ్, రూరల్ మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు రామిరెడ్డి, కొత్తపల్లి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సిరిపురం నాగప్రసాద్, హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు మర్రి రాజి రెడ్డి, అలువల లక్ష్మణ్, చామనపల్లి కాంగ్రెస్ నాయకులు జగ్గాని కనకయ్య, దీకొండ శంకరయ్య, బుర్ర స్వామి గౌడ్, బుర్ర హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.