బాలాపూర్ బీమ్ మండపంను సందర్శించిన
బీఎస్పి చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బాలాపూర్ బీమ్ మండపంను సందర్శించిన
బీఎస్పి చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షుడు
గుడ్ల శ్రీనివాస్ మహారాజ్ ఆధ్వర్యంలో..
బాలాపూర్, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భీమ్ మండపంను సందర్చించిన స్వేరోస్ సంస్థ చైర్మన్ , బీఎస్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా బాలాపూర్ స్వేరో సర్కిల్ నాయకులు మైలరాం జగన్ ఆధ్వర్యంలో స్వేరో సర్కిల్ సభ్యులు, స్వేరో స్టూడెంట్స్ భీమ్ మండపం ఏర్పాటు చేశారు. ఈ మేరకు బాలాపూర్ గ్రామంలోని భీమ్ మండపంను సందర్శించిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఘనంగా స్వాగతం పలికిన మహేశ్వరం నియోజకవర్గ (అసెంబ్లీ) అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్ మహరాజ్, కమిటీ సభ్యులు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మైలరాం జగన్ వారి టీంను అదేవిధంగా వారు చేసిన కార్యక్రమలు వివరించారు.

ఈ కార్యక్రమంలో సర్కిల్ సభ్యులు ఎర్ర అశోక్, జిల్లా బాలరాజు, విక్రమ్, గణేష్, శివలను సన్మానించారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మీరు ఒక్క పూట తినకున్న పర్వాలేదు కానీ మీ బిడ్డలను బాగా చదివించండని, రేపు వారు ఉన్నత స్థాయి శిఖరాలు చేరి లక్షల రూపాయలు సంపాదిస్తారని పిలుపునిచ్చారు. మీరు ఎప్పుడు కూడ పిల్లల ముందు తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దని, వారి ముందు మంచిగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు.

రాబోవు రోజులల్లో ఇ లాంటి భీమ్ మండపాలు, గాంధ్రలయలు చాలా నెలకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, స్వేరోస్, బీఎస్పీ నాయకులు, ఆరెస్పీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *