మొక్కలు నాటిన బండ్లగూడ జాగిర్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్

మొక్కలు నాటిన బండ్లగూడ జాగిర్
మేయర్ బుర్ర మహేందర్ గౌడ్

  • జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్

బండ్లగూడ జాగిర్, జూన్ 22 (విశ్వం న్యూస్) : ఈరోజు బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ తన పుట్టినరోజును పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు.

అనంతరం మేయర్ మాట్లాడుతూ పర్యావరణంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందంటూ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వాములు అని చేస్తూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని మేయర్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *