టీజీపీఎస్సీ చైర్మన్‌గా
బుర్ర వెంకటేశం

- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులు అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 30 (విశ్వం న్యూస్) : టీజీపీఎస్సీ ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 3తో ముగియనుంది. ఈ క్రమంలో ఇటీవలే టీజీపీఎస్సీ చైర్మన్ నియమకానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 20 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో టీజీపీఎస్సీపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు టీజీపీఎస్సీ కమిషన్ సభ్యులు సైతం అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో టీజీపీఎస్సీ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోనే టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం నియామకం దస్త్రంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. దీంతో ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం డిసెంబర్ 2న పదవీబాధ్యతలు స్వీకరించనున్నారు.
రెండో ప్రయత్నంలో స్టేట్ టాపర్
ఇకపోతే సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన బుర్రా వెంకటేశం నిరుపేద గౌడ కుటుంబం నుంచి వచ్చారు. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవడం..రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన బుర్రా వెంకటేశం ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో చదవడం మెుదలు పెట్టారు. హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ సబ్జెక్టులుగా తీసుకుని 1990లో తొలిసారి సివిల్స్ రాశారు. తొలి ప్రయత్నంలోనే సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం సాధించారు. 1993 జనవరిలో బెంగుళూరులో కస్టమ్స్ అధికారిగా చేరారు. మళ్లీ రెండో ప్రయత్నంలో ఆంత్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ సబ్జెక్టులుగా తీసుకుని కోచింగ్ లేకుండానే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. రెండో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు & ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ ర్యాంకు సాధించి టాపర్‌గా నిలిచారు.