కరీంనగర్ వాణిజ్య పనుల శాఖ
జాయింట్ కమిషనర్ గా సిహెచ్
రవి కుమార్ పదవి బాధ్యతలు
- తెలంగాణ రాష్ట్ర టి సి టి ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, జి బిక్షపతి ఆధ్వర్యంలో శాలువాలు పుష్పగు చాలు స్వీట్లు తినిపించి భారీ ఎత్తున సన్మానించడం జరిగింది
కరీంనగర్, ఆగస్టు 28 (విశ్వం న్యూస్) : కరీంనగర్ పట్టణంలో ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ పోస్ట్ కొన్ని రోజుల నుండి ఖాళీగా ఉంది ఆ యొక్క పోస్ట్ వెంటనే నియమించాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల తెలంగాణ టిసిటిఎన్జీవోస్ సంఘ అధ్యక్షుడు జి బిక్షపతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ మరియు సెక్రటరీ శ్రీమతి వై సునీత గారికి సంఘ ఆధ్వర్యంలో టి సి టి ఎన్జీవోస్ సంఘం పక్షాన రెప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ కాళీ పోస్టును కరీంనగర్ ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్ పదవి బాధ్యతలు చేపట్టిన సిహెచ్ రవికుమార్ కు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జాయింట్ కమిషనర్ పోస్టులో అదనపు బాధ్యతలు సిహెచ్ రవికుమార్ చేపట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతా కుమారి ఐఏఎస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఆమె ఇచ్చిన ఆదేశాలను అనుసరించి సోమవారం రోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల జాయింట్ కమిషనర్ గా సిహెచ్ రవి కుమార్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా టి సి టి ఎన్జీవో అధ్యక్షులు జి బిక్షపతి ఆధ్వర్యంలో జెసి సిహెచ్ రవికుమార్ శాలువాలతో పుష్పగుచ్చాలతో స్వీట్ల తినిపించి జెసి సిహెచ్ రవికుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జెసి కార్యాలయం మేనేజర్ వి మాదయ్య, సీటీవో వన్ వి హరిచరణ్, టు సి టి ఓ శ్రీమతి కవిత, సిరిసిల్ల సిటిఓ శ్రీమతి శైలజ, పెద్దపల్లి సిటిఓ గౌతమ్ సిద్ధార్థ, జగిత్యాల్ సిటిఓ ఆనంద్ రావు, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ కరీంనగర్ డివిజన్ ఉద్యోగ సంఘ నాయకులు అనిల్ కుమార్, ఎం ఏ భారీ, ముప్పిడి శ్రీనివాస్, శ్రీనివాస్ రావు, శంకర్, శ్రీమతి కృష్ణవేణి, శ్రీమతి సునీత, శ్రీమతి రజిత, శ్రీమతి హేమలత, శ్రీమతి సుచిత్ర, చైతన్య, శ్రీమతి వాణి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకుడు నరసింహారెడ్డి, ఎల్ రాజా, రాజేంద్రప్రసాద్, కిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న అందరూ ఉద్యోగులకు కుటుంబ సభ్యులారా చూసుకోవాలని ఉద్యోగుల ఏమైనా సమస్యలు ఉంటే సంఘం పక్షాన మీకు ఈ దృష్టికి వారి యొక్క సమస్యలను తీసుకొని వస్తామని ఆ సమస్యల పరిష్కారం కొరకు మీ వంతు కృషి చేయాలని సంఘం పక్షాన కోరిన వెంటనే ఈ సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తాను అని నూతనముగా పదవి బాధ్యతలు చేపట్టిన జాయింట్ కమిషనర్ సిహెచ్ రవికుమార్ ఉద్యోగ సంఘాలకు ఉద్యోగులు హామీ ఇచ్చినారని మహమ్మద్ ముజాహిద్ హుస్సే న్ ఈ సందర్భంగా తెలిపారు.