పోరుబాటలో తెలంగాణ
మున్సిపల్ కాంట్రాక్ట్,
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

జమ్మికుంట, ఆగస్టు 28 (విశ్వం న్యూస్) : జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగి సదానందం మాట్లాడుతూ నాటి గ్రామపంచాయతీ 1998వ సంవత్సరం నుండి నేటి వరకు 25 సంవత్సరాలుగా ఇప్పుడున్న మున్సిపాలిటీ వరకు 350 రూపాయల వేతనం నుండి విధులు నిర్వహిస్తున్నామని మా పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పుడు స్ట్రైక్ చేసిన వెయ్యి రూపాయలు పెంచి సర్దుమనచడం జరుగుతుందని, కోవిడ్ నుండి అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పటికీ వాతావరణంలో ఏర్పడిన మార్పు కారణంగా ఎలాంటి సమస్యలు వచ్చినా మొదటగా స్పందించేది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులే.

పారిశుద్ధ్య కార్మికులు దైవంతో సమానం అని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి తో సహా పారిశుద్ధ్య కార్మికుల సేవలను వెలకట్టలేమని తెలుపుతూ తమ శ్రమని గుర్తించి ఆదరించకుండా చాలీచాలని జీతాలతో కొనసాగిస్తున్నారని వివిధ ప్రభుత్వ శాఖల్లో 8 గంటలు పని చేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించారు కానీ పారిశుద్ధ్య కార్మికులైన తమను క్రమబద్ధీకరించలేదన్నారు.
పారిశుద్ధ్య కార్మికులలో అర్హత కలిగిన ఉద్యోగులను గుర్తించి వారికి తగిన పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశాడు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ పరిసర మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.