చలో హైదరాబాద్ పద్మశాలి శంఖారావం

చలో హైదరాబాద్

  • పద్మశాలి శంఖారావం సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం పిలుపునిచ్చారు

వీణవంక, ఆగస్టు 24 (విశ్వం న్యూస్) : వీణవంక మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్లో హైదరాబాదులో జరిగే పద్మశాలి శంకరావం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం హాజరై మాట్లాడుతూ సెప్టెంబర్ 3 తేదీన కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణం హైదరాబాద్ లో నిర్వహించే పద్మశాలి శంకరానికి కుటుంబ సమేతంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు కోరారు.

మన ఓటు మనకే మన సీటు మనకే నినాదంతో మనం బలగం అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో పద్మశాలిలకు అవకాశాలు కల్పించాలని గ్రామపంచాయతీ నుండి నియోజకవర్గ స్థాయి వరకు రాజకీయ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. నిరుపేద పద్మశాలి కుటుంబాల విద్యార్థులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఉన్నతంగా ఎదిగేలా ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ హరి, మండల అధ్యక్షుడు ఆనందం రాజమల్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ మధుసూదన్, మండల ఉపాధ్యక్షుడు బోళ్ల సదానందం, ప్రధాన కార్యదర్శి రాజగోపాల్, ఉపాధ్యక్షుడు రాజు, కోశాధికారి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *