పాస్టర్ ప్రభుదాసు కుటుంబానికి చార్లెట్ ఫౌండేషన్ చేయూత

పాస్టర్ ప్రభుదాసు కుటుంబానికి
చార్లెట్ ఫౌండేషన్ చేయూత

నాగారం, శుక్రవారం 28 (విశ్వం న్యూస్): నాగారం మండల కేంద్రం వర్ధమానుకోట గ్రామంలో పాస్టర్ బండారి ప్రభుదాసు స్వగృహానికి చేరుకున్న చార్లెట్ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు, పాస్టర్ సతీమణి బండారి యశోద మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబానికి చేయూతగా నిత్యావసర సరుకులు — బియ్యం, చీరలు, దుప్పట్లు — అందజేశారు. కష్టకాలంలో సహాయం అందించడం తమ ఫౌండేషన్ ధర్మమని బ్రదర్ డేవిడ్ రాజు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు బిషప్ దుర్గం ప్రభాకర్, ఇరుగు సంసోను, రెవ. గుగులోతు బాలాజీ నాయక్, రెవ. జలగం జేమ్స్, పాల్వాయి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *