కలర్ సత్తన్నకు…తెలంగాణ ఉద్యమ సేవారత్న అవార్డు ప్రధానం..

కలర్ సత్తన్నకు…తెలంగాణ
ఉద్యమ సేవారత్న
అవార్డు ప్రధానం..

విశ్వం న్యూస్/కరీంనగర్, ఏప్రిల్ 25: తెలంగాణ ఉద్యమంలో విశేష సేవలందించిన నాయకుడు, ప్రముఖ నటుడు మరియు కళాకారుడు కలర్ సత్తన్నకు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు “తెలంగాణ ఉద్యమ సేవారత్న” మరియు “షార్ట్ ఫిలిం నవ్వుల రారాజు” అవార్డులను ఘనంగా ప్రదానం చేశారు.

ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో జరిగిన హెచ్.ఆర్.పీ.ఎస్ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా ఈ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో కలర్ సత్తన్న సేవలను కొనియాడుతూ నిర్వాహకులు ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్త, హెచ్.ఆర్.పీ.ఎస్ కార్యవర్గ సభ్యులు, పలువురు కళాకారులు, నాయకులు, అభిమానులు పాల్గొని సత్తన్నను అభినందించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన కృషి, కళారంగంలో చూపిన ప్రతిభకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *