జిల్లాలో ఉన్న ఐవిఎఫ్
సెంటర్ లను తనిఖీ చేయండి

బాధితులను మోసం చేస్తున్న పద్మజ సంతాన
సాఫల్య కేంద్రాన్ని మూసివేయండి.
మోసపోయిన బాధితుల డబ్బులు తిరిగి చెల్లించాలి,
లేదంటే పోరాటం ఉధృతం చేస్తాం
కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ఐవిఎఫ్ సెంటర్ లను తనిఖీలు చేయాలనీ, పద్మజ సంతాన సాపల్య కేంద్రాన్ని మూసివేయాలని డి జిల్లా వైద్యాధికారి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి, బండారి శేఖర్ లు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ఐవిఎఫ్ సెంటర్ లపై, వారి అక్రమాలపై జిల్లా వైద్యాధికారి సమక్షంలో తనిఖీలు చేయాలనీ, పద్మజ సంతాన సాపల్య కేంద్రాన్ని మూసివేయాలని డిమాండ్ చేశారు.
పద్మజ సంతాన సాఫల్య కేంద్రం యాజమాన్యం సంతానం లేని వరికి పిల్లలు అయ్యాటట్లు చేస్తామని చెప్పుతూ 2లక్షల నుండి 10లక్షల వరకు బాధితుల నుండి వాసులు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్క నెల రోజుల పార్మసి మందులకు 50వేల నుండి 70వేలు బిల్లు తీసుకోవడం దుర్మార్గమని ఇంత దోపిడీ రాష్ట్రములో ఎక్కడ లేదని విమర్శించారు. కనీస అర్హత లేని కొంత మంది డాక్టర్లు, సిస్టర్లు ఇతర సిబ్బంది ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్పటల్ ఫార్మసీలో కనీస అనుభవం లేని వ్యక్తిని పెట్టుకుని మందులు ఇస్తున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్రంలో ఉన్న పద్మజ సంతాన సాఫల్య కేంద్రం హాస్పిటల్ భర్త వినయ కుమార్ మాజీ నక్సలైట్ ను నా గురించి మీకు తెలియదు మీ అంతు చూస్తాను అంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి బెదిరింపులకు ఎవ్వరు భయపడరని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. పద్మజ సంతాన సాఫల్య కేంద్రం మోసపోయిన బాధితులందరు జిల్లా వైద్యాధికారి గారికి పిర్యాదు చేయాలనీ, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు. బాధితులందరికీ అండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ అండగా ఉంటుందనితెలిపారు. పిల్లలు అవడానికి ఐవిఎఫ్ టెస్ట్ కోసం, ల్యాబ్, ఫార్మసీ ఇతర ఖర్చులు ఎంత అవుతున్నాయో సమగ్రంగా విచారణ చేయాలనీ ప్రభుత్వ యంత్రంగానికి సూచించారు. పిల్లలు లేని వారికి పిల్లలు అయ్యేలా చేస్తామని ఆశ పెట్టడం ఆర్ఎంపీలు, పిఆర్ ల ద్వారా బాధితులను హాస్పటల్‌కు తెప్పించుకొని డబ్బులు కట్టించుకోవడం అన్యాయం అన్నారు. పద్మజ హాస్పటల్ అనుమతులు తీసుకునే ముందు, తనిఖీలప్పుడు లేదా హాస్పటల్ రెన్యువల్ చేసుకునే ముందు హాస్పటల్లో పనిచేస్తున్న సిబ్బందిని డాక్టర్లవి ఇతరులవి సర్టిఫికెట్లు డీఎంహెచ్ఎ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుందని అన్నారు.
దీనిపై సమగ్ర విచారణ చేయాలనీ డిమాండ్ చేశారు. హాస్పటల్ కు సంతానం కోసం వస్తున్నటువంటి వారి వద్ద నుండి వసూలు చేస్తున్న డబ్బుల రసీదులు కాకుండా వేరే రశీదులు పెట్టి తక్కువ డబ్బులు రాసుకొని ఇన్‌కాం టాక్స్, జిఎస్టిని ఎగ్గొడుతున్నారు విమర్శించారు. హాస్పిటల్లో ఉన్న ఫార్మసీని పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలి. ఇతర జిల్లాల నుండి రాష్ట్రాలను వస్తున్నటువంటి బాధితుల వద్ద నుండి 2 లక్షల నుండి 10 లక్షలు తీసుకొని సంతాన అయ్యేలా చేస్తామని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు . బాధితులు మోసపోయామని గ్రహించి హాస్పిటల్ కి వచ్చి నిలదీస్తే హాస్పిటల్ యజమాన్యం బెదిరింపులకు గురి చేస్తున్నరాణి పిర్యాదులో పేర్కొన్నామని తెలిపారు. వీటి అన్నింటిపై సమగ్ర విచారణ చేయగలరని కోరారు.పద్మజ హాస్పిటల్ పై వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారికి మంత్రి గారికి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పద్మజ హాస్పిటల్ పై చర్యలు తీసుకోకపోతే ఆలిండియా బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలియజేసారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి. ప్రశాంత్ కుమార్, బద్రీ నేత పాల్గొన్నారు.