పోడుభూముల పట్టాలు పంపిణీ
చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
కుమురం భీమ్, జూన్ 30 (విశ్వం న్యూస్) : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజనులకు పోడుభూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు లాంఛనంగా ప్రారంభించారు. లబ్దిదారుల కుటుంబాలలోని గిరిజన మహిళల పేరుతో, 12 మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ గారు స్వయంగా పట్టాలు అందించారు.
ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామ పంచాయతీకి చెందిన కర్పెత విమలాబాయి దంపతులు, కెరమెరి మండలం జోడెఘాట్ గ్రామ పంచాయతీకి చెందిన కాటి అన్యాబాయి దంపతులు, సిర్పూర్ (అర్బన్) మండలం పంగిడి గ్రామ పంచాయతీకి చెందిన కుమ్ర మంకూబాయి దంపతులు, తిర్యానీ మండలం ఏదులపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఏదుల ఎల్లక్క దంపతులు, వాంకిడి మండలం పాటగూడ గ్రామ పంచాయతీకి చెందిన కత్లే భగీరథ దంపతులు, జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన వనిత మగదె దంపతులు, కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన మాధవీలక్ష్మి దంపతులు, మాధవీకల్లుబాయి దంపతులు, కాగజ్ నగర్ మండలం మాలినీ గ్రామ పంచాయతీకి చెందిన సూర్పం సునీత దంపతులు, సూర్పం అనసూయ దంపతులు, కాగజ్ నగర్ ఎన్జీవోస్ కాలనీ టేకం జానూబాయి దంపతులు, ఆత్రం రాంబాయి దంపతులకు సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాలు అందజేశారు.