Today TrendingVishwam Newsఆంధ్రప్రదేశ్జాతీయంతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు

లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రులు

హైదరాబాద్, జనవరి 18 (విశ్వం న్యూస్) : ఆలయ అధికారులు, అర్చకులు సిఎంలకు ఘన స్వాగతం పలికారు.అనంతరం సిఎంలు లక్ష్మీనర్సింహాస్వామి వారిని దర్శించుకున్నారు. మూల విరాట్ స్వయంభు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు, వేద పండితులు సంకల్పం, సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. హారతి, తీర్ధ ప్రసాదాలు అందించారు. అనంతరం అర్చకులు, సిఎంలకు వేద పండితులు మంత్రోచ్ఛరణలతో వేద ఆశీర్వచనం అందించారు . శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు తిలకించారు . ఆలయ ప్రాశస్త్యం , ఆధునీకరించిన విధానం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర సీఎంలు, నేతలకు వివరించారు. యాదాద్రి ఆలయం నుండి ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్న ముఖ్యమంత్రులు, అగ్ర నేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *