హైదరాబాద్ లో జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం
హైదరాబాద్ లో జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం


హైదరాబాద్, జనవరి 18 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు మంగళవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు వీరంతా బుధవారం ఉదయం 9.45 గంటలకు ప్రగతిభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డి. రాజా సహా పలువురు జాతీయ నేతలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఘనంగా స్వాగతం పలికారు. వారందరితో కలిసి ప్రగతిభవన్లో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయ పరిస్థితులపై వారు చర్చించుకున్నారు.
రెండు హెలీకాప్టర్లలో యాదగిరి గుట్టకు ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు రెండు హెలీకాఫ్టర్లలో యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ , యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తదితరులు ఉన్నారు. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు హెలీపాడ్ నుండి తొలుత ప్రెసిడెన్షియల్ సూట్ కు చేరుకున్నారు.



